నంద్యాల అర్బన్: మహానందిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ,స్వామి అమ్మ వార్ల దర్శనానికి మూడు గంటల సమయం
Nandyal Urban, Nandyal | Jun 7, 2026
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వారి దర్శనం నిర్విరామంగా ఏర్పాటు చేశారు. పాఠశాలలకు సెలవు దినాలు ముగుస్తుండడంతో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. ఆలయంలోని పుష్కరిణిలలో భక్తులు పుణ్యస్నాన ఆచరించి క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి స్వామివార్లను దర్శించుకుంటున్నారు.