పటాన్చెరు: అల్లీ నగర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను జెసిపితో కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ అల్లినగర్ గ్రామంలోని సర్వే నంబర్ 27లో తెలంగాణ కాలనీలో అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ జయప్రకాష్ నారాయణ అన్నారు.