సిర్పూర్ టి: బెజ్జూరు మండల కేంద్రంలో నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత, ఆటో సీజ్, కేసు నమోదు
బెజ్జూరు మండల కేంద్రంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటల్లా రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ పట్టుకున్నారు. మంగళవారం బెజ్జోరుకు చెందిన షేక్ తాజుద్దీన్ ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆటోలో లోడ్ చేశాడు. ఇంతలోనే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి ఆటతోపాటు బియ్యాన్ని స్వాధీన పరచుకొని కేసు నమోదు చేశారు,