బనగానపల్లె: బనగానపల్లెలో వైభవంగా ఇమామ్ కాసిం పీర్ల ఊరేగింపు
మొహర్రం పర్వదినాల సందర్భంగా ఎనిమిదో రోజు బుధవారం బనగానపల్లె తెలుగుపేటలో ఇమామ్ ఖాసీం స్వామి పీర్ల ఊరేగింపు వైభవంగా సాగింది. ఈ ఊరేగింపు మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది.మంత్రి కుటుంబ సభ్యులు బీసీ ఇందిరా రెడ్డి స్వామివారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ఫతేహాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.