శరవేగంగా రోడ్ల విస్తరణ పూర్తి: KLR* డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు వచ్చే అతిరథ మహారధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా, వసతులు కల్పిస్తున్నామని KLR తెలిపారు. *కొత్త జోన్ పరిధిలోకి బడంగ్ పేట: లక్ష్మారెడ్డి* మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లను త్వరలో ఏర్పాటు కానున్న కొత్త జోన్ లోకి తీసుకొస్తామని మరోసారి కిచ్చెన్నగారు స్పష్టం చేశారు.