గుంతకల్లు: గుత్తి అర్ఎస్ రైల్వే బుకింగ్ కార్యాలయంలో సెల్ ఫోన్ చోరికి యత్నం, ఆటో డ్రైవర్లు పట్టుకోగా తప్పించుకున్న దొంగ
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న బుకింగ్ కార్యాలయంలో ఓ ప్రయాణికుడి నుంచి గుర్తు తెలియని దొంగ సెల్ ఫోన్ లాక్కొని పరుగెడుతుండగా ఆటో డ్రైవర్లు పట్టుకోగా తప్పించుకొని పారిపోయాడు. ఆదివారం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రైల్వే బుకింగ్ వద్ద శనివారం రాత్రి ఓ ప్రయాణికుడు హైదరాబాద్ కు వెళ్లేందుకు టికెట్ కొనేందుకు సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని లైన్ లో నిల్చున్నాడు. అయితే ఓ గుర్తు తెలియని దొంగ ప్రయాణికుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని పరుగెత్తాడు. ఆటో డ్రైవర్లు పట్టుకోగా తప్పించుకొని పారిపోయాడు.