ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో స్వచ్ఛభారత్ ర్యాలీ మానవహారం ప్రతిజ్ఞ : మున్సిపల్ కమిషనర్ మహేష్
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్వచభారత్ 2025 సంవత్సరం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ మహేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ పారిశుద్ధ్యకార్మికులు కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్‌లో మానవహారంగ ఏర్పడి, మున్సిపల్ పారిశుద్ద్యసిబ్బందితో మున్సిపల్ కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వార్డులను ఎప్పుడు శుభ్రంగా ఉంచేలా చూస్తామని ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు అక్టోబర్ 2వరకు జరుగుతాయని కమిషనర్ ప్రకటించారు.