ఒంగోలు అర్బన్: బెల్ట్ షాపులపై పోలీసుల దాడి 56 మద్యం బాటిల్లు స్వాధీనం
Ongole Urban, Prakasam | May 3, 2026
*ప్రకాశం జిల్లా తేదీ:03.05.2026* *టంగుటూరు పురం సెంటర్ లో అక్రమ బెల్ట్ షాపు ల పై పోలీసుల దాడులు నిర్వహించి 56మద్యం సీసాల స్వాధీనం* ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్., గారి ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా, టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్ సిఐ భీమా నాయక్ గారి పర్యవేక్షణలో ఆదివారం టంగుటూరు పట్టణంలోని పురం సెంటర్లో ఉన్న రెండు బెల్ట్ షాపుపై ఒంగోలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో 56 మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు