తాడేపల్లిగూడెం: సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు అధ్యక్షతన పెంటపాడులో విస్తృతస్థాయి సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపుకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయం వద్ద విస్తృతస్థాయి సమావేశం శనివారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో కార్మిక చట్టాలను మార్పు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసింది కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారని అన్నారు.