గుంతకల్లు: గుత్తి అర్ఎస్ రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలులో నుంచి దిగుతూ రైలు కింద పడి వీరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ లోని రైల్వే స్టేషన్ 2వ నంబర్ ప్లాట్ ఫామ్ పై కదులుతున్న రైలులో నుంచి దిగుతూ రైలు కింద పడి వీరేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ కు చెందిన వీరేష్ గుత్తి స్టేషన్ లో రైలు దిగాల్సి ఉంది. అయితే నిద్రలో ఉన్న అతడు చూసుకోకుండా రైలు కదిలాక దిగుతూ రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.