సర్వేపల్లి: దళిత నేతలపై అక్రమ కేసులు దారుణం : చెముడుగుంటలో మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మూలాకత్ అయ్యారు. ఆయనతో భేటీ అయిన అనంతరం గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. దళిత నేతలను ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం దారుణం అన్నారు