దాచేపల్లిలో పోస్ట్ ఆఫీస్ సేవలు బంద్
గత 12 రోజులకు దాచేపల్లి పోస్ట్ ఆఫీస్లో సేవలు పనిచేయక పోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ సర్వర్ ప్రాబ్లం కారణంగా ఈనెల ఆరవ తేదీ నుంచి ఇప్పటివరకు దాచేపల్లి పోస్ట్ ఆఫీస్లో సేవలు కొనసాగడం లేదు. దీంతో ప్రతిరోజు వచ్చే కస్టమర్లు ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సేవలు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.