పాన్‌గల్: చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పలు చర్చి లో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
వనపర్తి జిల్లా చిన్నచింత కుంట మండల కేంద్రంలో బుధవారం క్రైస్తవ సోదరులు, క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చర్చి పెద్దలు ఎమ్మెల్యేలను సన్మానించారు. ఏసుప్రభు సూచించిన ప్రేమ దయ గుణం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.