ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతలు రామచందర్ రావు, బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. అంబేడ్కర్ దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అని రామచందర్ రావు అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చింది, లండన్‌లో లైబ్రరీ ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు.