వేములవాడ: కలెక్టర్ ను సస్పెండ్ చేయాలి: బీసీ సాధికారత సంఘం నాయకులు
ప్రజా పాలన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్ల ప్రోటోకాల్ పాటించని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను సస్పెండ్ చేయాలని బిసి సాధికారత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వేములవాడ మున్నూరు కాపు సత్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఏఎస్పి కార్యాలయంలో ఏ.ఎస్.పి శేషాద్రిని రెడ్డికి కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బీసీ బిడ్డ అయినందుకే అవమానించారని బీసీ నాయకులు వాపోయారు. మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడి అసహనం వ్యక్తం చేశారు.