బనగానపల్లె: బనగానపల్లె లో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య
నంద్యాల జిల్లా బనగానపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడడంతో తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, ఆనవాళ్ల ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.