చిత్తూరు అర్బన్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పుస్తకం రచించి ప్రదర్శిస్తూ తిరుమలలో వీడియో ఆవిష్కరణ, సోషల్ మీడియాలో విమర్శలు
Chittoor Urban, Chittoor | Jun 13, 2026
చిత్తూరు జిల్లాలోని తిరుమలలో ఇద్దరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి వివాదానికి కారణమయ్యారు. శ్రీవారి ఆలయం ఎదుట "పవన్ కళ్యాణ్ అనే నేను" పుస్తకాన్ని ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించి రీల్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచారం, ప్రదర్శనలకు నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.