డోన్: ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 7, 2026 ప్రకృతిని పరిరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం డోన్ మండలం ఉడుములపాడులో టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వృక్షో రక్షిత రక్షితః కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో బాధ్యతగా ఒక మొక్కను పెంచడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు.