రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో తాగు, మరుగుదొడ్లు లాంటి మౌలిక వసతులకు రూ.86.68 లక్షలు నిధులు విడుదల చేసి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల గురించి మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.