పలమనేరు: బైరెడ్డిపల్లి: సచివాలయం ఎదురుగా రోడ్డుపై యూరియా కోసం బైఠాయించి ధర్నా చేసిన రైతులు
బైరెడ్డిపల్లి: మండల రైతులు సచివాలయం ఎదురుగా రోడ్డుపై యూరియా కోసం బైఠాయించి ధర్నా చేపట్టామన్నారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం తిరిగి తిరిగి విసిగి వేసారి పోయాము. అధికారులు యూరియా ఇస్తామన్నారు కానీ ఇంతవరకు చాలామందికి ఇవ్వలేదు,దయచేసి రైతులకు యూరియాను అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా యూరియా కావాలంటూ నినాదాలు చేశారు, సమాచారం అందుకున్న అధికారులు రైతులకు నచ్చజెప్పి అందరికీ యూరియాని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా నిర్వహించారు.