నంద్యాల అర్బన్: ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని ఇప్పించాలంటూ నంద్యాలలో ఓ మాజీ సైనికుని ఆవేదన
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
కార్గిల్ యుద్ధంలో పోరాడిన తనకు గత టిడిపి ప్రభుత్వ హాయంలో కేటాయించిన భూమిని తనకు ఇప్పించాలంటూ నంద్యాలకు చెందిన వరప్రసాద్ అనే సైనికుడు ఆవేదన వ్యక్తం చేశాడు సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు గతంలో తనకు బండి ఆత్మకూరు మండలం జిసి పాలెం లో మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారని అయితే ఇప్పుడు వేరే వాళ్ళు సాగు చేసుకుంటున్నారని ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని తెలిపారు