ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావు 118 వ జన్మదిన వేడుకలు
Ongole Urban, Prakasam | Apr 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఒంగోలు ఎమ్మెల్యే బాపట్ల ఎంపీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సరితర కార్యాలయాల తో పాటుగా అంబేద్కర్ భవనంలోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహాలకు మరియు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు చదివి స్వతంత్ర సమరయోధుడిగా భారత ఉప ప్రధానిగా భారత కేంద్ర మంత్రిగా అతను చేసిన సేవలను కొనియాడారు నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు