ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్ ఎం కాంపౌండ్ వీధిలో: సిమెంట్ రోడ్డు వద్ద పొంచి ఉన్న ప్రమాదం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్ ఎం కాంపౌండ్ వీధిలో ఆరు నెలల కిందట వేసిన నూతన సిమెంట్ రోడ్డు వద్ద ప్రమాదం పొంచి ఉంది, రోడ్డు నిర్మాణం సరిగా చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి, రోడ్డు ఎగుడు దిగుడుగా ఉండడంతో వాహనాలు వెళ్లే క్రమంలో స్కిడ్ అవుతున్నాయి, రోడ్డు ఎత్తుగా నిర్మించడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు పక్కన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ప్రజలు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.