కనిగిరి: ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కనిగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
కనిగిరి: ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కనిగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ... హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి అన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని భూములు లేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.