ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండల పరిధిలోని నాయుడుపాలెం పెద్ద రావిపాడు మధ్య రహదారి తీవ్రంగా దెబ్బతింది. రోడ్డు మొత్తం గుంతలుగా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ రహదారిలో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు రైతులు అత్యవసర సేవలు వాహనాలు ప్రయాణించాలంటే కష్టాలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.