డోన్: గ్యాస్ బ్లాక్ మార్కెట్ పై డోన్ లో సిపిఎం నాయకులు ఆగ్రహం
Dhone, Nandyal | Apr 9, 2026 నంద్యాల జిల్లా డోన్లో గ్యాస్ బ్లాక్ మార్కెట్పై సీపీఎం పట్టణ కార్యదర్శి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా గ్యాస్-మా హక్కు' నినాదంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గ్యాస్ ధరల పెంపుతో పాటు ఏజెన్సీల దోపిడీ వల్ల ప్రజలు, చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు.