ఒంగోలు అర్బన్: పెట్రోల్ డీజిల్‌కు కొరత లేదని, రైతులు, వాహనదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:జిల్లా ఎస్పీ
Ongole Urban, Prakasam | Apr 28, 2026
ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అద్దంకి పట్టణంలోని VSR పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలలో భాగంగా బంక్‌లలో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలపై అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి, పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా కొనసాగించాలని సూచించారు. ఎటువంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే బంకు నిర్వాహకులు ఇంధనాన్ని కేవలం వాహనాలకు మాత్రమే నింపాలని, క్యాన్‌లలో నింపరాదని ఆదేశించారు.