యువత భవిష్యత్తు మారాలి, ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ ఫోరం అధ్యక్షుడు నరేంద్ర, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి
యువత భవిష్యత్తు మారాలని ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ పోరం అధ్యక్షుడు నరేంద్ర పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ ఫోరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, ఎస్సీ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసగాని కుల్లాయప్ప,ఎస్సీ జన సంఘం కుల్లాయప్ప,ఎంఎస్ ఆదినారాయణ బిఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వక్తలు మాట్లాడారు .యువత ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాజకీయాలలో తమ భాగస్వామ్యాన్ని రూపొందించు కోవాలన్నారు.