రాజమండ్రి సిటీ: కొవ్వూరులో రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలని ధర్నా
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం సాయంత్రం రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనాకు ముందు కొవ్వూరులో ఆపిన అన్ని రకాల ఎక్స్ప్రెస్ సర్వీసులను తిరిగి నడపాలని డిమాండ్ చేశారు. రైళ్ల నిలుపుదలపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. ఈ సమస్య తీరేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.