జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో వైభవంగా రుక్మిణి పాండురంగ సహిత ఉమామహేశ్వర రథోత్సవం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శ్రీ రుక్మిణి పాండురంగ సహిత ఉమామహేశ్వర ఆలయంలో కార్తిక ఏకాదశి, ద్వాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కొనసాగింది. సోమవారం ఉదయం ఆలయంలో గోపాల కాడ పల్లకి సేవ, విష్ణు సహస్ర పారాయణం, మహా మంగళ హారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతోపాటు భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించారు.