బొబ్బిలి: పట్టణ శివారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకున్నట్టు బొబ్బిలి పట్టణ సీఐ నాగేశ్వరరావు వెల్లడి
బొబ్బిలి పట్టణంలోఅక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ నాగేశ్వరావు తెలిపారు. అప్పయ్యపేట శివారులో టీవీఎస్ ఎక్సెల్‌పై సుమారు 1500 రూపాయల విలువ గల పది మద్యం సీసాలను తీసుకువెళుతున్న బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన మామిడిపాక తిరుపతిరావుని అదుపులోకి తీసుకున్నారు. పిరిడి జంక్షన్ వద్ద పిరిడికి చెందిన శృంగవరపు వినోద్ కుమార్ అనే వ్యక్తి తన హోండా షైన్ మీద రూ.2340 విలువైన 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు మోదు చేసారు.