ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
Ongole Urban, Prakasam | Apr 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజక వర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు గురువారం ఒంగోలు వన్ టౌన్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీకెండ్ విత్ ఆర్కే ప్రోగ్రాం నిర్వాహకుడు రాధాకృష్ణ మరియు యాంకర్ ఎడిటర్ల పై ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మనోభావాలను దెబ్బతీసే విధంగా కార్యక్రమాన్ని ప్రచారం చేయడమే కాకుండా కార్యక్రమంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు