ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో కయ్యానికి కాలు దువ్విన ఆబోతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ముమ్మిడివరంలో ఆబోతులు కయ్యానికి కాలు దువ్వాయి. నగర పంచాయతీ పరిధి ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో ఆబోతులు నువ్వా నేనా అంటూ దెబ్బలాడుకున్నాయి. వాటిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురవ్వారు. వాహనదారులకు సైతం దారి ఇవ్వకుండా కొట్లాడుకున్నాయి. వాహనదారులు భయపడుతూ ప్రయాణాలు కొనసాగించారు. రాత్రి సమయంలో రహదారులపై రాత్రి సమయంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆబోతులను కట్టడి చేయాలని కోరుకుంటున్నారు.