బనగానపల్లె: హామీలు నెరవేర్చేంతవరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం :.బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు వైసీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గురువారం బనగానపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్, బాండ్లను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రజలను కూటమి ప్రభుత్వం నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి, అత్తర్, జాహిద్ తదితరులు తదితరులు పాల్గొన్నారు