అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కల్లూరు సమీపంలో రైలులో నుంచి పడి నేపాల్ కు చెందిన మహిళ మృతి
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి నేపాల్ కు చెందిన భూమా దమేని అనే మహిళ మృతి చెందింది. ఢిల్లీ సమీపంలోని మత్తురా నుంచి బెంగళూరుకు కేకే ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టు మాత్రం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.