అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని వైయస్సార్ సర్కిల్లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడేరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉరవకొండ సమన్వయకర్త వై విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిపి వీరన్న తదితర నాయకులతో కలిసి హాజరయ్యారు.