రామడుగు: లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుండి మూడు బాహుబలి మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు
కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని గాయత్రి పంప్ హౌస్ నుండి CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో 3 బాహుబలి మోటార్ల తో గురువారం ఉదయం 9:10 AM కి నీటి పారుదల శాఖ అధికారులు వరద కాలువకు నీటిని విడుదల చేశారు,అయితే ముందుగా ఈనెల 13వ తేదీన బుధవారం ట్రైల్ రన్ నిర్వహించి అనంతరం యధావిధిగా నేడు మూడు మోటార్ల ద్వారా 9,450 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు,అయితే ఇది కేవలం ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే నీటిని విడుదల చేస్తూ రాత్రివేళ నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు తదుపరి ఆదేశాల వరకు నీటి విడుదల ఇలాగే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు,