ఒంగోలు అర్బన్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
Ongole Urban, Prakasam | Jun 8, 2026
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఈరోజు పెరిగిన ధరలకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒక్కో విద్యార్థికి సగటున 20రూపాయల పైగా ఖర్చు అవుతున్నదని ప్రభుత్వం అది దృష్టిలో పెట్టుకొని కార్మికులను ఆదుకోవాలి కోరారు. పేద కార్మికులకు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలను పెంచటం తో పాటు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.