జల ధార జల హారతి సాగునీటి సంఘాల బాధ్యత : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టి, భూగర్భ జలాన్ని పెంచడమే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జలధార – జలహరతి – సాగునీటి సంఘాల భాద్యత కార్యక్రమాన్ని జిల్లా లో ప్రతిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జలవనరులు, డ్వామా, గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో చేపడుతున్న జలధార – జలహరతి – సాగునీటి సంఘాల భాద్యత కార్యక్రమం పురోగతిపై క్షుణ్ణంగా సమీక్షించి దిశానిర్దేశం చేసారు.