నిజామాబాద్ రూరల్: కంజర గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపి మృతి
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపి మృతి చెందినట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. నర్సింపల్లికి చెందిన వెల్దుర్తి గంగాధర్ ఆర్ఎంపీ శనివారం అర్ధరాత్రి కంజర గ్రామానికి వెళుతూ, రెసిడెన్షియల్ స్కూల్ పక్కనగల పొదల్లో చెట్ల మధ్యన ఇరుక్కొని చనిపోయాడు. రెసిడెన్షియల్ వాచ్మెన్ సమస్యల మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.