నంద్యాల అర్బన్: ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన బాలుడిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన నంద్యాల పోలీసులు
Nandyal Urban, Nandyal | May 17, 2026
ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నంద్యాల నందమూరి నగర్కు చెందిన బి. నాగరాజును తల్లి మందలించడంతో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏఎస్పీ ఎం.జావలి ఆదేశాల మేరకు సీసీఎస్ టీం, తాలూకా పోలీసులతో గాలింపు చేపట్టి కసాపురం దగ్గర గుర్తించి, ఆదివారం నంద్యాలలో తల్లిదండ్రులకు అప్పగించారు