డోన్: బేతంచర్ల లో ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
Dhone, Nandyal | Apr 30, 2026 నంద్యాల జిల్లా బేచంచెర్లలోని కొత్త బస్టాండు ఎదురుగా ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అనురాధ థియేటర్ సమీపాన నివాసముండే వేణు రెడ్డి(19) టిఫిన్ చేసేందుకు వచ్చి రోడ్డు పక్కన నిలుచున్నాడు. ప్రమాదవశాత్తు నాపరాళ్ల ట్రాక్టర్ ఢీకొనడంతో గాయాలపాలయ్యాడని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.