అసిఫాబాద్: వాంకిడి మండలంలో 380 గంజాయి మొక్కలు పట్టివేత
గంజాయి సాగు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. వాంకిడి మండలం కోలాం చిచ్పల్లి గ్రామ శివారులో గంజాయి సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం వాంకిడి పోలీసులు దాడి చేసి 380 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని అదే గ్రామానికి చెందిన నాగేష్ పై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.