వేములవాడ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది: వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్
వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ శుక్రవారం ఆధ్వర్యంలో వేములవాడ టౌన్ అంబేద్కర్ నగర్ 163 బూత్ లో “ఓటు చోరీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనల ప్రేరణతో,తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు,వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శీనన్న అడుగుజాడల్లో ఈ కార్యక్రమం చేసినట్లు చెప్పారుఈ సందర్భంగా న్యాత నవీన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దొంగ ఓటు,నకిలీ ఓటు వంటి అక్రమాలను అరికట్టడానికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు.