డోన్: డోన్ మండలం లో బావిలో పడి గొర్రెల కాపరి మృతి
Dhone, Nandyal | Aug 2, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బావిలో పడి గొర్రెల కాపరి మృతి చెందాడు. డోన్ పట్టణం నల్లగుట్టకు చెందిన శ్రీనివాసులు (44) గొర్రెలను మేపేందుకు వెళ్లి, నీళ్లు తాగేందుకు బావి వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాకేశ్ తెలిపారు.