జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ,ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోహిర్ ఎస్సై నరేష్ తెలిపారు. బిలాల్పూర్ గ్రామానికి చెందిన గూళ్ల పండరి అనే వ్యక్తి దిగ్వాల్ వద్ద తన ఎక్సెల్ వాహనంపై జాతీయ రహదారిని దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండరిని జహీరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.