కనిగిరి: లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట బందోబస్తు చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు
పెదచెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలిపారు. లింగన్నపాలెంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టేమన్నారు. వాహనాల పార్కింగ్ కు కేటాయించిన స్థలంలోని వాటిని పార్కింగ్ చేయాలని ఎస్పీ సూచించారు. సీఎం సభ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.