డోన్: డోన్ ఆర్టీవో కార్యాలయం వద్ద లైట్లు వెలగక వాహనదారులకు ఇబ్బందులు
Dhone, Nandyal | Jun 18, 2026 నంద్యాల జిల్లా డోన్ ఆర్టీవో కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారి 44 పక్కన గల సర్వీస్ రోడ్లో వీధిలైట్లు వెలగక చీకటిమయంగా ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పాదచారులు, వాహనదారులు వాపోయారు. కావున నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి లైట్లు ఏర్పాట్లు చేయాలన్నారు