నవాబ్‌పేట: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 158 ఫిర్యాదులు : అదనపు కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులని సత్వారమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 158 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు తమ సమస్యలను పరిష్కరించే విధంగా అధనపు కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించారని తెలిపారు. ముఖ్యంగా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీల జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.