కోడుమూరు: గూడూరులో హిందూ జన జాగృతి ఆధ్వర్యంలో ప్లకార్డులతో మౌన నిరసన, హిందూ దేవతలను అవమానించే బాణాసంచా విక్రయిస్తే చర్యలకు డిమాండ్
గూడూరు పాత బస్టాండ్ లో హిందూ జన జాగృతి నాయకులు ఆదివారం ప్లకార్డులతో మౌన నిరసన చేపట్టారు. భారత ప్రభుత్వం చైనా బాణాసంచాలో విషపదార్థాలు ఉండడంతో నిషేధించిందని, అదేవిధంగా హిందూ దేవతలను అవమానించే బాణసంచా విక్రయించే వారిపై ఐపిసి 295 ఏ ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు, బజరంగ్ దళ్ రాష్ట్ర గోరక్ష ప్రముఖ్ రాజేష్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు.